• Neti Charithra

30 ఇయర్స్ పృత్వి కి.. రాజకీయాల లోనే.. కాదు సినిమా ల్లోనూ కొనసాగుతున్న కష్టాలు !

హైదరాబాదు: నేటి చరిత్ర (జనవరి24)

30 ఇయర్ ఇండస్ట్రీ గా ప్రేక్షకుల ఆదరణ పొందిన నటుడు పృత్వి మొన్నటి వరకు.. ప్రత్యేక గుర్తింపు పొందారు. చాలా కాలంగా వైసీపీ అధినేత జగన్ తోనూ ఆయన మంచి సంబంధాలు కొనసాగించడం తో ఇటీవల పోటీ లో ఎంతో మంది ఉన్నా..తిరుపతి లో SVB ఛానల్ చైర్మన్ గా పదవి చేపట్టాడు. ఆ పదవిలోకి వెళ్ళాక పృద్వి రాజ్ సినిమా ప్రముఖులను, ప్రతిపక్ష రాజకీయనేతలను టార్గెట్ చేస్తూ అందరిని ఓ ఆట ఆడుకున్నాడు. వైసిపి ప్రభుత్వాన్ని చూసి వీరలెవల్లో రెచ్చిపోయాడు. అయితే SVB ఛానల్ చైర్మన్ గా పృద్వి ఆగడాలు ఒక్కొక్కటిగా బయటికి రావడంతో.. పృద్వి నెమ్మదిగా ఆ చైర్మన్ పదవికి రాజీనామా చేసి సైలెంట్ అయ్యాడు. అలా అనుకోకుండా రాజకీయాల్లో చుక్కెదురైన పృద్వి కి సినిమాల్లోనూ ఓ హిట్ ఛాన్స్ మిస్ అయ్యిందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

తాజాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల వైకుంఠపురములో పృద్వి కి ఓ ఛాన్స్ మిస్ అయినట్లుగా ఆ ఛాన్స్ హర్షవర్ధన్ కి తగిలినట్లుగా ఫిలింనగర్ టాక్. అలా వైకుంఠపురములో నెగెటివ్ షేడ్స్ ఉన్న హర్షవర్ధన్ పాత్ర పృద్వి కే రావాల్సింది. కానీ జనసేన అధ్యక్షుడు పవన్ మీద పృద్వి చేసిన వ్యాఖ్యల ఫలితంగా పృద్వికి ఆ ఛాన్స్ మిస్ అయినట్లుగా చెబుతున్నారు. మరి హర్షవర్ధన్ ఆ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రకి మంచి మార్కులే పడ్డాయి. ఆలా పృద్వి రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ ఒకేసారి బాగా నష్టపోయాడంటూ సోషల్ మీడియాలో జాలితో కూడిన కామెంట్స్ చేస్తున్నారు.