• Neti Charithra

3,309 కోట్ల తో.. టీటీడీ వార్షిక బడ్జెట్ కు.. పాలక మండలి గ్రీన్ సిగ్నల్ !


3,309 కోట్ల తో టీటీడీ వార్షిక బడ్జెట్ కు పాలక మండలి.. గ్రీన్ సిగ్నల్ !



తిరుమల: నేటి చరిత్ర (ఫిబ్రవరి29)


టీటీడీ బడ్జెట్ 3,309 కోట్లు

-టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి


తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.


తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అలాగే, పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు.


2020-21 సంవత్సరానికి గాను రూ.3,309 కోట్ల బడ్జెట్ కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.


గత ఏడాది కంటే రూ. 66 కోట్ల మేర టీటీడీ బడ్జెట్ పెరిగింది.


బూందీపోటులో అగ్నిప్రమాదాల నివారణకు రూ.3.30 కోట్లతో థర్మో ఫ్లూయిడ్ స్టౌలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు.


సోషల్ మీడియాలో టీటీడీ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అరికట్టేందుకు ఇన్ఫోసిస్ సహకారంతో సైబర్ క్రైమ్ విభాగం ఏర్పాటుకు నిర్ణయం.


అలిపిరి దగ్గర వాహనాల ఎంట్రీ టోల్ ఫీ పెంపుదలకు నిర్ణయం, టూవిలర్ కు టోల్ ఫీ మినహాయింపు...కార్లు,జీపులు లకు 50రూపాయలు, బస్సు, లారీలు 100 రూపాయలు, హెవీ వాహనాలకు 200 రూపాయల చొప్పున వసూలు చేయాలని నిర్ణయించిన టీటీడీ.


తిరుపతిలోని జూపార్క్ దగ్గర 14 కోట్లతో ప్రతిభావంతుల శిక్షణా సంస్థ వసతి గృహం నిర్మాణానికి ఆమోదం.


రూ.34 కోట్లు ఎస్.వి బధిరపాఠశాల హాస్టల్ నిర్మాణానికి నిర్ణయం..




21 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon