- Neti Charithra
29 లక్షల మంది విద్యార్హులకు ఆధార్ అప్డేట్..కు ప్రభుత్వం చర్యలు!

#29 లక్షల మంది విద్యార్హులకు ఆధార్ అప్డేట్..కు ప్రభుత్వం చర్యలు!
అమరావతి: నేటి చరిత్ర (సెప్టెంబర్25) ఏపీ లోని ఐదేళ్లు నిండిన విద్యార్థులకు వచ్చే 3 నెలలలో ఆధార్ నవీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ అన్నారు. ఆధార్ నవీకరణ పైలట్ ప్రాజెక్ట్‌ను రాష్ట్రంలోనే తొలిసారిగా తాడేపల్లి పట్టణంలోని జడ్పీ హైస్కూల్లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవలు పొందడానికి పలు పథకాలలో ఆధార్ ఉపయోగపడుతుందన్నారు. ఏపీలో విద్యాశాఖపరంగా మిగిలిన రాష్ట్రాలకంటే 97 శాతం ఆధార్ సీడింగ్ చేయడం జరిగిందన్నారు. ఆధార్ నమోదులో చిన్నపిల్లలకు (0-5 వయస్సు) బయోమెట్రిక్ తీసుకోరు కాబట్టి ఒక నెంబరు మాత్రమే కేటాయిస్తారన్నారు. 5 ఏళ్లు దాటిన తరువాత మాత్రమే వేలుముద్రలు, ఐరిష్ నమోదు చేసుకుంటారని, అలాగే 15వ సంత్సరములో కూడా నవీకరణ చేయించుకోవాలన్నారు. ఇప్పటివరకు చేసిన 97 శాతంలో ఆధార్ నెంబర్లు ఉన్నాయి కానీ, వేలిముద్రలు లేకపోవడం వలన రాష్ట్రంలో 29 లక్షల మంది విద్యార్థులకు ఆధార్ నవీకరణ చేయాల్సి వచ్చిందన్నారు. బ్లూ త్రీ ఐటీ ఆనే ఏజెన్సీ సమన్వయంతో ప్రతి పాఠశాలలో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసి, బయోమెట్రిక్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ విజయవంతమయితే దేశంలోనే ఆధార్ నవీకరణ చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందన్నారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. గతంలో 43 శాతం ఉండే ఆధార్ నమోదు నేడు 97 శాతానికి పెరిగిందన తెలిపారు. 2016-17లో 6 లక్షల మంది విద్యార్ధులు ఆధార్ నమోదు చేయించుకోవడం వలన మధ్యాహ్న భోజన పథకంలో రూ.100 కోట్లు, పాఠ్యపుస్తకాలకు సంబందించి రూ.27 కోట్లు ఆదా చేసుకోగలిగామని తెలిపారు. గుంటూరు జిల్లాలో 3 లక్షల 31 వేల మంది పిల్లలు ఆధార్ నవీకరణ చేయించుకోవాల్సి ఉందని అన్నారు.