• Neti Charithra

29 న జరిగే 5 కే రన్ ను విజయవంతం చేయండి- కలెక్టర్ భరత్ గుప్తా

#29 న జరిగే 5 కే రన్ ను విజయవంతం చేయండి- కలెక్టర్ భరత్ గుప్తా

చిత్తూరు: నేటి చరిత్ర (ఆగస్టు28) ఈ నెల 29 వ తేది నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా 5 కె రన్ కార్యక్రమం లో అందరూ భాగస్వామ్యులై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశపు మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే నేషనల్ స్పోర్ట్స్ డే కార్యక్రమం లో భాగంగా 5 కె రన్ ను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని, ఈ 5 కె రన్ కార్యక్రమం గురువారం ఉదయం 6.30గం.లకు స్థానిక డి ఎస్ ఏ స్టేడియం నుండి నగరవనం వరకు సాగి తిరిగి డి ఎస్ ఏ స్టేడియం వద్ద ముగుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, పుర ప్రముఖులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ5 కె రన్ లో గెలుపొందిన మొదటి విజేతకు రూ.5 వేలు, రెండవ విజేత కు రూ.3 వేలు, మూడవ విజేతకు రూ.2 వేలు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుందని కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం లో పాల్గొని ఫిట్ ఇండియా మూమెంట్ ప్రారంభోత్సవంలో భాగస్వామ్యు లు కావాలన్నారు. ఉదయం 9 గం.లకు నాగయ్య కళాక్షేత్రం లో ప్రారంభమయ్యే కార్యక్రమం లో యోగా, జూడో, బాడీ బిల్డింగ్, రెజెలింగ్, టై క్వాండూ ప్రదర్శన ఉంటుందని అనంతరం ఎరోబిక్ ఎక్సర్సైజస్ అనంతరం ముఖ్య అతిథులచే ప్రసంగం తదుపరి ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ తరువాత గౌరవ భారత ప్రధాని లైవ్ ప్లెడ్జ్ ప్రోగ్రాం ప్రసారమవుతుందన్నారు. అనంతరం అంతర్జాతీయ, జాతీయ క్రీడా పోటీల్లో స్వర్ణం, రజితం, కాంస్యం పథకాలు పొందిన వారిని సన్మాన కార్యక్రమం జరుగుతుందన్నారు. 5 కె రన్ లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానోత్సవం ఉంటుందన్నారు. ఈ విలేకరుల సమావేశం లో డి ఆర్ ఓ విజయ్ చందర్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీ తేజ్, సెట్విన్ సి వి ఓ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.