• Neti Charithra

26 న శ్రీశైలం.. తిరుమల ఆలయాల మూసివేత!

#26 న శ్రీశైలం.. తిరుమల ఆలయాల మూసివేత!

తిరుమల: నేటి చరిత్ర (డిసెంబర్16) సూర్య గ్రహణం కారణంగా ఈనెల 26న తిరుమల, శ్రీశైలం ఆలయాలు మూతపడనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 13 గంటలపాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తితిదే అధికారులు తెలిపారు.

డిసెంబర్‌ 25న రాత్రి 11 గంటల నుంచి 26 మధ్యాహ్నం 12 వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. దీంతో పాటు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం కూడా మూతపడనుంది. ఈ నేపథ్యంలో 26న తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి. శ్రీశైలంలోనూ.. గ్రహణం కారణంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉభయ దేవాలయాల ద్వారాలను మూసివేస్తునట్టు దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. గ్రహణం రోజు ఉదయం 11.30 గంటల వరకు ఆలయం మూసివేయనున్నట్టు ఆయన చెప్పారు.