• Neti Charithra

2500 ఆలయకమిటీ పాలకవర్గాలు ను రద్దు చేసిన ప్రభుత్వం

#2500 ఆలయకమిటీ పాలకవర్గాలు ను రద్దు చేసిన ప్రభుత్వం

అమరావతి: నేటి చరిత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2500 దేవాలయాల ట్రస్టు బోర్డులన్నింటినీ రద్దు చేసినట్లు రాష్ట్ర దేవదాయశాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తెలిపారు. నూతన ట్రస్టు బోర్డుల ఏర్పాటుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఈ దఫా రాజకీయాలకు అతీతంగా ఆ భగవంతునికి సేవలందించే వారికే పెద్దపీట వేస్తామన్నారు. గత శాసన సభ సమావేశాల్లో ట్రస్టు బోర్డుల్లో సైతం వెనుకబడిన వర్గాలు, దళితులు, మహిళలకు 50శాతం అవకాశం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రకారం నియామకాలు జరుగుతాయన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్ధానం నూతన సేవా కమిటీ నియామకం తో పాటు 13 జిల్లాల్లో 2500 ఆలయాలకు కొత్త పాలక వర్గాలు రానున్నాయన్నారు. అన్ని వర్గాల వారికి భగవంతుడిని సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని అమలు చేస్తూ ఈమేరకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.