• Neti Charithra

25 న వాల్మీకుల ఆత్మీయ సమావేశం

# 25 న వాల్మీకుల ఆత్మీయ సమావేశం

బి కొత్తకోట:నేటి చరిత్ర (ఆగస్టు23) చిత్తూరుజిల్లా బి కొత్తకోట లో ఈనెల 25 న నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు పేర్కొన్నారు. శుక్రవారం వారు విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ వాల్మీకుల సమస్యల సాధనకు చేపట్టాల్సిన కార్య క్రమాలు పై చర్చిస్తామని ఈ సమావేశానికి జిల్లా మరియు రాష్ట్ర స్థాయి సంఘ నాయకులు హాజరు కానున్నారని వారు తెలిపారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని వారు వాల్మీకులను కోరారు. సమావేశం లో సున్నం కిట్టన్న, కుక్కల ప్రసాద్, ప్రభాకర్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.