204 మంది మిట్స్ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు మంజూరు..

#204 మంది మిట్స్ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు మంజూరు..

మదనపల్లె: నేటి చరిత్ర (సెప్టెంబర్8) మదనపల్లి ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ & సైన్స్, మదనపల్లి నందు కళాశాలలో బి.టెక్ చదువుతున్న 204 మంది విద్యార్థులకు వివిధ స్కాలర్షిప్ లు మంజూరు అయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. విద్యార్థులు యొక్క మెరిట్ కు ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా వివిధ ప్రైవేట్ ఏజెన్సీ వారు ఈ స్కాలర్షిప్ లను మంజూరు చేసినట్లు ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం వారి మెరిట్ కం మీన్ స్కాలర్షిప్, ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్, సెంట్రల్ సెక్టార్ స్కీం స్కాలర్షిప్ మొదలైన స్కాలర్ షిప్ లకు విద్యార్థులు ఎంపిక అయినట్లు ఆయన అన్నారు. ప్రతి సంవస్తరం తమ విద్యార్థులు సుమారు 500 మందికి పైగా వివిధ సంస్థల నుండి స్కాలర్షిప్ లు మంజూరు అవుతున్నాయని, విద్యార్థుల యొక్క మెరిట్ ప్రతి స్కాలర్షిప్ కు అవసరం అని, ప్రతి సెమిస్టర్ లోను తమ విద్యార్థులు ప్రతిభ కనపరుస్తున్నారని ఆయన అన్నారు. ఎంపిక అయిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్, స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ సమీనా ఖాన్, మౌలాలి మరియు సురేష్ లు అభినందనలు తెలియజేసారు.