- Neti Charithra
200 రైళ్ల రాకపోకలకు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్... రైలు ప్రయాణాలకు మార్గదర్శకాలు జారీ !

200 రైళ్ల రాకపోకలకు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్... రైలు ప్రయాణాలకు మార్గదర్శకాలు జారీ !
ఢిల్లీ: నేటి చరిత్ర
దేశ వ్యాప్త 60 రోజుల లాక్ డౌన్ తో నిలిచిపోయిన రైళ్లు మళ్ళీ చాలా కాలం తర్వాత జూన్ 1 నుంచి మొదటి విడతగా 200 రైళ్ల రాకపోకలకు కేంద్రం అనుమతిచ్చింది. దింతో పలు నిబంధనలు అమలు చేస్తూ.. రైళ్ల ను నడపాలని నిర్ణయించింది. ముఖ్యంగా

ముంబయి-హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ (02701/02), హావ్‌డా- సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (02703/04), హైదరాబాద్- న్యూదిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (02723/24), దానాపూర్- సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (02791/92), విశాఖపట్నం- దిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (02805/06), గుంటూరు- సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్

(07201/02) , తిరుపతి- నిజామాబాద్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (02793/94), హైదరాబాద్- విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్ (02727/28).
దురంతో రైళ్లు: సికింద్రాబాద్- హజ్రత్ నిజాముద్దీన్ (02285/86) (వారానికి రెండుసార్లు)
సాధారణ తరగతి సీట్లకూ రిజర్వేషనే ప్రత్యేక రైళ్లలో సాధారణ తరగతి పెట్టెల్లోని సీట్లకు కూడా రిజర్వేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సీట్ల రిజర్వేషన్ ఉండే జనరల్ కోచ్‌లకు ద్వితీయ తరగతి సీటింగ్ రుసుములు వసూలు చేస్తారు. * మొత్తంమీద ఈ రైళ్లలో రిజర్వేషన్ లేని పెట్టెలంటూ ఏవీ ఉండవు. * అన్ని టికెట్లనూ ఐఆర్సీటీసీ వెబ్సైట్/ యాప్ ద్వారానే తీసుకోవాలి. రిజర్వేషన్ కౌంటర్లు, రైల్వే స్టేషన్లలో టికెట్లు తీసుకునే అవకాశం ఉండదు. రైల్లోనూ ఎవరికీ టికెట్లు ఇవ్వరు. * 30 రోజుల ముందుగా టికెట్లు తీసుకోవచ్చు. * ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ టికెట్లను కూడా నిబంధనల ప్రకారం జారీ చేస్తారు. * తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్లు ఉండవు.
సికింద్రాబాద్, విజయవాడ మీదుగా
* హావ్‌డా-యశ్వంత్‌పూర్ (వయా విజయవాడ) దురంతో ఎక్స్‌ప్రెస్ (02245/46).. వారానికి ఐదు రోజులు * ముంబయి సీఎస్టీ- భువనేశ్వర్ (వయా సికింద్రాబాద్, విజయవాడ) కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (01019/20).. ప్రతిరోజు