• Neti Charithra

18 విమానాల రద్దు.. ఆందోళన లో ప్రయాణికులు!

ఢిల్లీ: నేటి చరిత్ర (డిసెంబర్23)

విమానాలు అందుబాటులో లేకపోవడం, కాక్‌పిట్‌ సిబ్బంది కొరతతో 18 దేశీయ విమానాలను గోఎయిర్‌ రద్దు చేసింది. గోఎయిర్‌కు చెందిన ఏ320 నియో విమానాల్లో ఇంజన్‌ సమస్యలతో ఆ విమానాలు కొన్ని అందుబాటులో లేవని ఎయిర్‌లైన్‌ వర్గాలు తెలిపాయి. ఈ సమస్యలతో పాటు కాక్‌పిట్‌ సిబ్బంది కొరతతో ముంబై, గోవా, బెంగళూర్‌, ఢిల్లీ, శ్రీనగర్‌, జమ్ము, పట్నా, ఇండోర్‌, కోల్‌కతా నుంచి బయలుదేరాల్సిన 18 విమానాలను సోమవారం గోఎయిర్‌ రద్దు చేసింది.