• Neti Charithra

176 మంది ఎమ్మెల్యే ల పై క్రిమినల్ కేసులు!

#176 మంది ఎమ్మెల్యే ల పై క్రిమినల్ కేసులు!

ముంబయి : నేటి చరిత్ర (అక్టోబర్26) మహారాష్ట్ర శాసన సభకు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 176 మంది క్రిమినల్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌(ఎడిఆర్‌) నివేదికలో వెల్లడించింది. మొత్తం 288 ఎమ్మెల్యేలకుగానూ 285 మంది సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించగా..62 శాతం(176 మంది) ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉండగా..40 శాతం(113 మంది) ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నట్లు ఎడిఆర్‌ గుర్తించింది. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల సంబంధించి అఫిడవిట్లు ఎలక్షన్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో లేనందున వాటిని విశ్లేషించలేకపోయినట్లు పేర్కొంది. 2014 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో 165 మంది క్రిమినల్‌ కేసులు, అందులో 115 మంది తీవ్రమైన క్రిమినల్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈసారి ఎక్కువ మంది నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఎన్నికయ్యారని తేలిందని ఎడిఆర్‌ పేర్కొంది. రద్దయిన అసెంబ్లీలోని 254 మంది ఎమ్మెల్యేలు (88శాతం) కోటీశ్వరులు కాగా, ప్రస్తుత అసెంబ్లీ ఎమ్మెల్యేల్లో 264 మంది (93శాతం) కోటీశ్వరులు ఉన్నారని తెలిపింది.