• Neti Charithra

17 మంది టీడీపీ ఎమ్మెల్యే ల ను సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం !

అమరావతి : నేటి చరిత్ర (జనవరి20)

అసెంబ్లీ నుంచి తెదేపా సభ్యుల్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభలో సీఎం జగన్‌ మాట్లాడుతుండగా తెదేపా సభ్యులు పోడియం వద్దకు వచ్చి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు.

దీంతో సీఎం జగన్‌ స్పందిస్తూ ఉద్దేశపూర్వకంగానే తెదేపా సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారని.. ఆ పార్టీ సభ్యులను సభ నుంచి సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌కు సూచించారు. దీంతో సభా వ్యవహారాల మంత్రి బుగ్గన లేచి సస్పెండ్‌ చేయాల్సిన సభ్యుల పేర్లు చదివి వినిపించారు. అనంతరం స్పీకర్‌ సభ నుంచి 17 మంది తెదేపా సభ్యులను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రవేశద్వారం వద్ద తెదేపా సభ్యుల భైఠాయింపు సభ నుంచి సస్పెండ్‌ చేయడంతో తెదేపా సభ్యులు ప్రవేశద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. రాజధాని అమరావతికి మద్దతుగా పోరాడుతుంటే అన్యాయంగా తమను సభ నుంచి సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా నేతలంతా నిరసన తెలిపారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్