• Neti Charithra

17 మంది ఎమ్మెల్యే ల భవిషత్తు పై 5 న కీలక నిర్ణయం!

#17 మంది ఎమ్మెల్యే ల భవిషత్తు పై 5 న కీలక నిర్ణయం!

బెంగుళూరు: నేటి చరిత్ర (అక్టోబర్26) కర్ణాటకలో 17మంది శాసనసభ్యులపై నాటి స్పీకర్‌ రమేష్‌కుమార్‌ వేసిన అనర్హత వేటుపై తీర్పును సుప్రీంకోర్ట్‌ వచ్చే నెల 5కు రిజర్వ్‌ చేసింది. నవంబర్‌ 4వరకు దీపావళి శెలవులు రావటంతో జస్టిస్‌ ఎన్‌వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు నిర్ణయించింది. శుక్రవారం ధర్మాసనం ముందు కాంగ్రెస్‌పార్టీ తరపున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ మాట్లా డుతూ కాంగ్రెస్‌ జెడిఎస్‌పార్టీలకు చెందిన శాసనసభ్యులు కుమారస్వామి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినియోగ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో పాల్గొనకుండా విప్‌ను ఉల్లం ఘించారని, వీరిపై లెజిస్లేచర్‌ చట్టంతో పాటు రాజ్యాంగం లోని 10వ అధికరణం ప్రకారం పార్టీ ఫిరాయింపులుగా ద్రువీకరించి స్పీకర్‌ కాంగ్రెస్‌కు చెందిన 14మందిపైన, జెడిఎస్‌కు చెందిన ముగ్గురి పై అనర్హత వేటు వేశారని పేర్కొన్నారు. ఈవిషయంలో స్పీకర్‌ తన అధికారాలను చట్టబద్దంగానే చలాయించి న్యాయం చేకూర్చారని కపిల్‌ సిబాల్‌ ధర్మాసనానికి తెలిపారు. ఆ 17మందిలో 15మంది బిజెపి ప్రలోభాలకు లోనై ముంబాయిలో క్యాంపు వేశారని అంటూ, ఈ విధంగా వ్యూహాత్మకంగా బిజెపికి మేలుచేశారని ఆరోపించారు. అనర్హత వేటు పడిన శాసనసభ్యులకు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వీలు కల్పిస్తే శాసనసభ కార్యకలా పాలను భ్రష్టుపట్టించిన వారవుతామని చెప్పారు.స్పీకర్‌కు ఉన్న అధికారాల గురించి రాజ్యాంగసభ చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనిని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని విజ్ఞప్తి చేశారు.