• Neti Charithra

166 మంది తహసిల్దార్ ల బదిలీలు !

#166 మంది తహసిల్దార్ ల బదిలీలు !

హైదరాబాదు: నేటి చరిత్ర (నవంబర్17) తెలంగాణా లో ప్రభుత్వం భారీ స్థాయి లో 166 మంది తహసిల్దార్లు బదిలీ అయ్యారు. ఆదివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభకు కిందటి సంవత్సరం డిసెంబరులో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా పలువురు తహసిల్దార్లను బదిలీ చేసిన విషయం విదితమే. ఐదవ జోన్‌లో పనిచేస్తున్న ఈ తహసిల్దార్లను ఎన్నికల విధుల కోసం బదిలీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపధ్యంలో... కిందటి సంవత్సరం అక్టోబరు 10, ఈ ఏడాది ఫిబ్రవరి 16 తేదీల్లో ఈ తహసిల్దార్లను బదిలీ చేశారు. ఇక ఎన్నికల ప్రక్రియలు పూర్తగా ముగిసిపోయిన నేపధ్యంలో... వీరందరినీ పాత్ర స్థానాలకు బదిలీ చేశారు. వీరందరినీ సోమవారమే తమ జాయినింగ్ రిపోర్ట్‌లను అందించాల్సిందిగా ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో ఆదేశించింది