• Neti Charithra

16 వేలు.. లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు చిక్కిన .. అధికారి !

16 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు చిక్కిన ప్రభుత్వ అధికారి !

విజయనగరం: నేటి చరిత్ర (ఫిబ్రవరి26)

విజయ నగరం లో మత్స శాఖకు చెందిన

క్షేత్రాధికారి మురళీ మత్స్యకారుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీఅధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మత్స్యశాఖ విజయనగరం డివిజన్‌ క్షేత్రాధికారిగా మురళీ విధులు నిర్వర్తిస్తున్నాడు. స్థానిక మత్స్యకారులు తమ సంఘం రిజిస్ట్రేషన్‌ కోసం మురళీని పది రోజుల క్రితం సంప్రందించారు. రిజిస్ట్రేషన్‌ చేయాలంటే సంఘంలోని ఒక్కొక్క సభ్యుడు రూ.1000 చొప్పున సంఘంలోని మొత్తం 16 మంది సభ్యుల కలిసి రూ. 16 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో సంఘం అధ్యక్షుడు వాసుదేవ్‌ ఇటీవల జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులను సంప్రదించి విషయం తెలియజేశాడు. పక్కా ప్రణాళిక ప్రకారం అధికారులు దాడి చేసి లంచం తీసుకుంటుండగా మురళీని పట్టకున్నారు. ఈ దాడుల్లో శ్రీకాకుళం అనిశా ఇంఛార్జ్‌ రమణమూర్తి, సీఐలు సతీష్‌ కుమార్, మహేశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు

59 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon