- Neti Charithra
150 మంది ప్రధానోపాధ్యాయులు..కు తాఖీదులు ఇచ్చిన ప్రభుత్వం..!
150 మంది ప్రధానోపాధ్యాయులు..కు తాఖీదులు ఇచ్చిన ప్రభుత్వం..!
తూర్పుగోదావరి జిల్లా: నేటి చరిత్ర
తూర్పుగోదావరి జిల్లా లోని
పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు-నేడు’ పనుల్లో వెనకబడ్డ 150 మంది పాఠశాలల ప్రధానోపాధ్యాయుల(హెచ్ఎం)కు తాఖీదులు జారీ చేసినట్లు జిల్లా
విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం తెలిపారు. వారి సమాధానం అనంతరం అవసరమైతే చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 1340 పాఠశాలల్లో నాడు-నేడు పనులు జరుగుతున్నాయన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీలు,
విద్యుత్తు, తదితర 9 అంశాలకు సంబంధించి ఈ పనులు చేపట్టామన్నారు. సెప్టెంబరు నెలలో బడులు తెరిచే నాటికి పూర్తి కావాల్సి ఉందన్నారు. కొన్నిచోట్ల పనుల్లో ప్రగతి కనిపించడం లేదని అబ్రహం పేర్కొన్నారు.
461 views0 comments