• Neti Charithra

15 మంది మిట్స్ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక

#15 మంది మిట్స్ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక

మదనపల్లె: నేటి చరిత్ర (ఆగస్టు25) Madanapalli Institute of Technology and Science(మిట్స్) కళాశాల నందు బి.టెక్ చివరి సంవత్సరము చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో 15 మంది విద్యార్థులు కు ఉద్యోగాలు లభించాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. 2020 లో బి.టెక్ పూర్తి చేసుకొనే ఈ.సి.ఈ మరియు సి.ఎస్.ఈ విద్యార్థులకు బెంగళూరు కు చెందిన నాలెడ్జ్ లెన్స్ కంపెనీ వారు నిర్వహించిన ఈ ప్రాంగణ ఎంపికలలో ప్రతిభ కనపరిచిన 9 మంది ఈ.సి.ఈ విద్యార్థులు మరియు 6 మంది సి.ఎస్.ఈ విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయని వీరికి వారి ప్రతిభ కు తగట్టుగా 4.50 నుండి 6 లక్షల వరకు సంవత్సరము ప్యాకేజి అని ఆయన అన్నారు. వెంకటేశ్వర్ రాజు, హర్ష వర్ధన్, వంశి కృష్ణ, దివ్య, భాను ప్రకాష్ రెడ్డి, మహ్మద్ తౌఫీక్, మురళి కృష్ణ, మాదవి, జగదీశ్, విష్ణు వర్ధన్ రెడ్డి, ఎస్.సాయ్ అభినయ్, టి. హర్షవర్ధన్ రెడ్డి, సి. కల్యాణి, సౌమ్య మరియు సౌమ్య శ్రీ లు ఎంపిక అయిన విద్యార్థులలో ఉన్నారు. ఆన్లైన్ పరీక్ష తో మొదలై టెక్నికల్ మరియు హెచ్.ఆర్ రౌండ్ లుగా మూడు రౌండ్లలో ఈ విద్యార్థులు ప్రతిభ కనపరిచారని, ఉద్యోగాలకు ఎంపిక అయిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్. సి. యువరాజ్, సీనియర్ ప్లేసెమెంట్ ఆఫీసర్ శర్వాన్ బాబు, విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.