• Neti Charithra

15 న బాధ్యతలు చేపట్టనున్న లోకాయుక్త చెర్మన్ పి లక్ష్మణ్ రెడ్డి...

#15 న బాధ్యతలు చేపట్టనున్న లోకాయుక్త చెర్మన్ పి లక్ష్మణ్ రెడ్డి..

అమరావతి: నేటి చరిత్ర (సెప్టెంబర్12) ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తగా నియమితులైన జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి ఈనెల 15న ప్రమాణస్వీకారం చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ నగరం లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారోత్సవం జరుగనుంది.రాష్ట్రంలో అవినీతి నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం ఏపీ లోకాయుక్తగా జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డిని నియమించింది. జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి గతంలో ఏపీ ఉమ్మడి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. లోకాయుక్త నియామకంతో పెండింగ్‌ కేసుల పరిష్కారం వేగవంతం కానున్నాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రభుత్వ పెద్దలు హాజరు కానున్నారు.