• Neti Charithra

140 మంది సీఐ లకు పదోన్నతులు కల్పించిన ఏపీ ప్రభుత్వం!

#140 మంది సీఐ లకు పదోన్నతులు కల్పించిన ఏపీ ప్రభుత్వం!

అమరావతి: నేటి చరిత్ర (సెప్టెంబర్22) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆరుగురు అధికారులకు పదోన్నతి కల్పించింది. వారికి సబ్‌ కలెక్టర్లుగా పోస్టింగ్‌ ఇచ్చింది. విజయవాడ సబ్‌ కలెక్టర్‌గా హెచ్‌ఎం. ధ్యానచంద్ర, గూడురు సబ్‌ కలెక్టర్‌గా రోణంకి గోపాలకృష్ణ, నరసాపురం సబ్‌ కలెక్టర్‌గా కేఎస్‌.విశ్వనాథన్‌, రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌గా సీపీ ప్రవీణ్‌ ఆదిత్య, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌గా టి.నిశాంతి, తెలంగాణ సబ్‌ కలెక్టర్‌గా కె.దినేష్‌ కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 140మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి లభించింది.