• Neti Charithra

14 ద్విచక్ర వాహనాల దగ్ధం.. గుంటూరు లో కల..కలం..!

#14 ద్విచక్ర వాహనాల దగ్ధం.. గుంటూరు లో కల..కలం..!

గుంటూరు : నేటి చరిత్ర (సెప్టెంబర్13) గుంటూరు జిల్లా నల్లచెరువులో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇళ్ళ ముందు ఉన్న 14 బైక్‌ లను గుర్తు తెలియని వ్యక్తులెవరో తగులబెట్టిన వైనం శుక్రవారం వెలుగు చూసింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఒకే సారి ఇన్ని వాహనాలను దగ్ధం చేయడం పై స్థానికంగా కలకలం రేగింది. ఆకతాయిల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు.