- Neti Charithra
13 జిల్లాల హెల్త్ బులిటెన్.. ను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం..!
13 జిల్లాల హెల్త్ బులిటెన్.. ను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం..!
అమరావతి: నేటి చరిత్ర
ఏపీలో కొత్తగా 10,175 కరోనా కేసులు నమోదైయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 68 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 5,37,687కి చేరగా, మరణాల సంఖ్య
4,702కు చేరింది. ప్రస్తుతం ఏపీలో 97,338 యాక్టివ్ కేసులు ఉండగా, 4,35,647 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 43.80 లక్షల కరోనా టెస్టులు నిర్వహించారు. కొత్తగా చిత్తూరు, కడప,
నెల్లూరు జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి చెందగా, కృష్ణా 7, ప్రకాశం 7, అనంతపురం 6, తూ.గో, ప.గో జిల్లాల్లో ఐదుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
272 views0 comments