• Neti Charithra

13 కేజీల విదేశీ బంగారు బిస్కెట్ల పట్టి వేత !

#13 కేజీల విదేశీ బంగారు బిస్కెట్ల పట్టి వేత !

భువ‌నేశ్వ‌ర్ : నేటి చరిత్ర (అక్టోబర్10) రైలులో బంగారం త‌ర‌లిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను గురువారం భువ‌నేశ్వ‌ర్‌ డిఆర్ఐ అధికారులు ప‌ట్టుకున్నారు. ర‌వుర్కెలా-ఝార్సుగూడ మ‌ధ్య ప్ర‌యాణిస్తున్న జ్ఞానేశ్వ‌రి ఎక్స్‌ప్రెస్‌లో త‌ర‌లిస్తున్న సుమారు 13 కేజీల విదేశీ బంగారు బిస్కెట్ల‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. నిందితులిద్ద‌రినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.