- Neti Charithra
12 మంది సబ్ ఇన్స్ పెక్టర్ లను బదిలీ చేసిన జిల్లా ఎస్పీ...!
12 మంది సబ్ ఇన్స్ పెక్టర్ లను బదిలీ చేసిన జిల్లా ఎస్పీ...!
గుంటూరు: నేటి చరిత్ర
గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో భారీగా
12 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ రూరల్ ఎస్పీ విశాల్‌గున్నీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా ఎస్సైలను వెంటనే తమకు కేటాయించిన ప్రాంతాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. తెనాలి-1 పట్టణం పీఎస్‌లో
ఉన్న జి.గిరిబాబును అమృతలూరుకు బదిలీ చేశారు. అమృతలూరులో ఉన్న జి.పాపారావును వీఆర్‌కు పంపారు. సత్తెనలిపల్లి పోలీసుస్టేషన్లో ఉన్న ఎస్కె నాజీర్బేగ్ను ముప్పాళ్లకు బదిలీ చేశారు. వీఆర్‌లో ఉన్న కె.శివప్రసాద్‌ను నిజాంపట్నంకు పోస్టింగ్ వేశారు. రేపల్లె పోలీసుస్టేషన్ ఎస్సై ఎం.విజయ్చరణ్ను వీఆర్‌కు పంపించారు. సీసీఎస్‌లో ఉన్న కె.చాణక్యను రేపల్లె పట్టణ పోలీసుస్టేషన్‌కు, మాచవరంలో ఉన్న ఎం.లక్ష్మీనారాయణ రెడ్డిని దాచేపల్లి-2కు బదిలీ చేశారు.
ఎం.రాజాను దాచేపల్లి నుంచి మాచవరానికి పంపారు. అటాచ్‌మెంట్‌పై కొల్లిపరలో ఉన్న ఐ.బాలరామిరెడ్డిని అదే స్టేషన్‌కు పోస్టింగ్ వేశారు. పెదకూరపాడులో ఉన్న ఐ.శామ్యూల్ రవికుమార్‌ను భట్టిప్రోలుకు బదిలీ చేశారు. ఎం.నారాయణను రేపల్లె నుంచి వీఆర్‌కు పంపారు. తెనాలి 1వ పోలీసుస్టేషన్లో ఉన్న కె.మల్లికార్జున రావును గుంటూరు రూరల్ డీసీఆర్బీకి బదిలీ చేశారు.