• Neti Charithra

117 మంది పోలీసులు కు కరోనా.. పాజిటివ్.. ముగ్గురు అధికారులు మృతి !



117 మంది పోలీసులు కు కరోనా.. పాజిటివ్.. ముగ్గురు అధికారులు మృతి !


ముంబై: నేటి చరిత్ర


మహారాష్ట్రలో కరోనా వైరస్‌ భూతంలా వెంటాడుతోంది. ఇప్పటి వరకు 107 మంది పోలీసు లకు కరోనా పాజిటివ్ ను గుర్తించగా మరో ముగ్గురు పోలీస్ అధికారులుమృతి చెందడం.. పోలీస్ వర్గాలను కలవర పెడుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కొవిడ్‌-19 తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ సమయంలో నగరంలో విధులు నిర్వర్తిస్తోన్న పోలీసులు ఈ వైరస్‌ బారిన పడుతుండడంతో  అధికారులు అప్రమత్తమయ్యారు. గత మూడు రోజుల్లో ముంబయిలో ముగ్గురు పోలీసులు కరోనా బారినపడి మరణించారు. ఈ ముగ్గురు కూడా 50ఏళ్ల వయసుపైబడిన వారేనని గుర్తించారు. దీంతో 55ఏళ్ల వయసుపైబడిన వారితోపాటు అనారోగ్య సమస్యలు ఉన్న పోలీసులు కొన్నిరోజులు సెలవులపై వెళ్లాలని ఉన్నతాధికారులు  సూచించారు.

నగరంలో కొవిడ్‌ తీవ్రత ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో తమ ఉద్యోగులు కరోనా వైరస్‌ బారినపడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 107మంది పోలీసులు కరోనా వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 20మంది ఉన్నతాధికారులు ఉన్నారు. వీరిలో ఎక్కువశాతం ముంబయిలో విధులు నిర్వహిస్తున్న వారే ఉండటం తో ముంబై లోని పోలీస్ కుటుంబాలు బెంబేలు ఎత్తుతున్నారు.


189 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon