• Neti Charithra

110 క్వింటాళ్లు రేషన్ బియ్యం సీజ్ చేసిన పోలీసులు!

#110 క్వింటాళ్లు రేషన్ బియ్యం సీజ్ చేసిన పోలీసులు!

రామగుండం : నేటి చరిత్ర (ఆకట్పబర్26) రామగుండం పోలీసు కమీషనరేట్‌ పరిధిలోని మంథని వెళ్ళు మార్గంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ రైస్‌ ను పోలీసులు పట్టుకున్నారు. గుంజపడుగు వద్ద సిరోంచకు అక్రమంగా డిసిఎం లో తరలిస్తున్న సుమారు 110 క్వింటాళ్ల పీడీఎస్‌ రైస్‌ ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల్లోకెళ్తే.. రామగుండం కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సత్యనారాయణ వివరాల ప్రకారం.. టాస్క్‌ ఫోర్సు సీఐ, సిబ్బందితో కలిసి మంథనికి వెళ్తుండగా.. కొంతమంది పీడీఎస్‌ రైస్‌ ను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం వారికి అందింది. దీంతో డీసీఎంను ఫాలో చేసిన పోలీసులు.. టిఎస్‌02యుఎ1517 నెంబర్‌ ఉన్న డీసీఎం ను అడ్డగించారు. అందులో సుమారు 110 క్వింటాళ్ల పీడీఎస్‌ రైస్‌ ఉన్నట్లు పోలీసులు గ్రహించారు. దీంతో డీసీఎం ను సీజ్‌ చేసిన పోలీసులు అక్రమానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.