• Neti Charithra

11 మంది దేవాదాయశాఖ ఉద్యోగుల కోసం... ఏసీబీ పరుగులు !


11 మంది దేవాదాయశాఖ ఉద్యోగుల కోసం... ఏసీబీ పరుగులు !




శ్రీశైలం: నేటి చరిత్ర



తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించిన శ్రీశైలం దేవస్తాన ఆలయంలో ఆర్థిక కుంభకోణాలు పై ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో ఏసీబీ అధికారులు రంగం లో కి దిగారు. ఇప్పటికే ఈ కేసులో14 మంది రెగులర్ ఉద్యోగులు , 24 మంది తాత్కాలిక ఉద్యోగులు ను దేవాదాయశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. 2016 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు జరిగిన జరిగిన అవినీతి అక్రమాల మూలాల ఛేదించేందుకు ప్రభుత్వం ఏసీబీ ని రంగంలోకి దించింది.

రూ.2.56 కోట్లు అవినీతి పై విచారణ కొనసాగుతుండగా రూ.90 లక్షలకు ప్రభుత్వం రికవరీ చేసింది.

ఈకేసులో కీలకంగా భావిస్తున్న 11 మంది ఉద్యోగులు నేటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో ఎసిబి అధికారులు అందుబాటులోకి రాని ఉద్యోగుల కోసం వెతకడం ప్రారంభించినట్లు సమాచారం. మూడు మాసాలు లో ఎసిబి నిందితుల ఆచూకీ బాధ్యులైన ఉద్యోగుల వివరాలు సేకరించాలని గత నెల లో ప్రభుత్వం ఆదేశించడంతో నిందితుల కోసం విచారణ ముమ్మరం చేసింది.