• Neti Charithra

108 వాహనానికి నిప్పు పెట్టిన..రౌడీ షీటర్.. దగ్ధం ఆయిన వాహనం..!


108 వాహనానికి నిప్పు పెట్టిన..రౌడీ షీటర్.. దగ్ధం ఆయిన వాహనం..!




ఒంగోలు : నేటి చరిత్ర


ఒంగోలు తాలుకా పోలీస్‌ స్టేషన్‌లో నేలపాటి సురేష్ అనే రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. ఓ కేసు విచారణలో భాగంగా

(ఆగంతకుడు చేతిలో దగ్ధం ఆయిన 108 వాహనం)


అతన్ని స్టేషన్‌కు తరలించగా పోలీసులకు చుక్కలుచూపించాడు. స్టేషన్‌లో మంగళవారం అర్ధరాత్రి డోర్ అద్దాలు పగలగొట్టి చేతులు గాయపరుచుకున్నాడు. దీంతో

అతన్ని పోలీసులు 108 వాహనం ఎక్కించి రిమ్స్‌ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. 108 అంబులెన్స్ ఎక్కిన నిందితుడు అక్కడ ఉన్న కాటన్‌కు నిప్పంటించాడు. చూస్తుండగానే మంటలు ఎగసిపడ్డాయి. అరగంట లోనే 108

వాహనం దగ్ధం అయ్యింది.అగ్నిమాపక కేంద్రం వచ్చి మంటలు అర్పడం తో మంటలు అదుపు లోకి వచ్చాయి. నిందితుడు మాజీ రౌడీ షీటర్ గా పోలీసులు గుర్తించారు.