• Neti Charithra

104 సేవలు..ను తనిఖీ చేసిన జిల్లా నోడల్ అధికారి లోక వర్ధన్..!


104 సేవలు..ను తనిఖీ చేసిన జిల్లా నోడల్ అధికారి లోక వర్ధన్..!


కెవిపల్లె: నేటి చరిత్ర


104 సేవలను జిల్లా నోడల్ అధికారి డాక్టర్ లోకవర్ధన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.కె.వి.పల్లి మండలం లోని దీన్నే మీద పల్లి లో నిర్వహిస్తున్న 104 సేవలను సోమవారం మధ్యాహ్నం 3.20ని డాక్టర్ లోవర్ధన్ పరిశీలించారు. ఈసందర్భంగా 104 సేవలో ఈరోజు ఓ.పి.ఎంత?

షుగర్,బి.పి.మరియు ఇంకా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు ఎంత మంది?వారికి మందులు నెలకు సరిపడా మందులు ఇస్తున్నారా? పడకపైన ఉన్న రోగులను,హారీస్క్ గర్భవతుల ను వారి ఇంటిదగ్గరకే వెళ్లి ఎంత మందిని చూసారు? త్రాగు నీటి వనరుల పరిశీలన క్లోరినేషన్ ద్వారా చేశారా? అంగన్వాడీ మరియు ప్రాధమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పరిశీలించారా? పిల్లలకు వైద్య పరీక్షలు

చేస్తున్నారా?గ్రామంలో ఉన్న కుష్టు మరియు క్షయ వ్యాధి గ్రస్థులు సమయానికి షెడ్యూల్ ప్రకారం మందులు మింగుచున్నారా ? అనే అంశాలపై ఆరా తీశారు.ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో 104 వైద్యులు డాక్టర్ హరివర్మ,తదితరులు పాల్గొన్నారు

153 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon