• Neti Charithra

100 మంది వి ఆర్ ఎ లకు వి ఆర్ ఓ లుగా పదోన్నతి కల్పించిన ప్రభుత్వం..!


100 మంది వి ఆర్ ఎ లకు వి ఆర్ ఓ లుగా పదోన్నతి కల్పించిన ప్రభుత్వం..!



విశాఖ: నేటి చరిత్ర



విశాఖ జిల్లాలో వివిధ గ్రామాల్లో వీఆర్‌ఏలుగా సేవలందిస్తున్న 100 మందికి

ప్రభుత్వంగ్రామ పరిపాలన అధికారి (వీఆర్వో) గ్రేడ్‌-2గా పదోన్నతి కల్పించారు. అయిదేళ్లు సర్వీసు నిండి, ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన వారికి ఈ అవకాశం కల్పించారు. జిల్లా రెవెన్యూ అధికారి శ్రీదేవి

ఆద్వర్యంలో ఏఓ రామ్మోహనరావు, ఇతర అధికారులు సోమవారం కలెక్టరేట్‌లో వీఆర్‌ఏలకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. సీనియార్టీ ఆధారంగా పదోన్నతులు

కల్పించి, కౌన్సెలింగ్‌ విధానంలో పోస్టింగ్‌లు కేటాయించినట్లు డీఆర్వో తెలిపారు. పదోన్నతి పొందిన వారంతా తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు.