• Neti Charithra

10 రోజుల్లో బియ్యం కార్డు, 20 రోజుల్లో ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేసే బాధ్యత అధికారులదే- సీఎం జగన్


10 రోజుల్లో బియ్యం కార్డు, 20 రోజుల్లో ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేసే బాధ్యత అధికారులదే- సీఎం జగన్



తాడేపల్లి: నేటి చరిత్ర


రాష్ట్రంలో నిర్దిష్ట కాలపరిమితిలో ప్రభుత్వ సేవలు అందకపోతే పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి జగన్​ ప్రకటించారు. స్పందన కార్యక్రమం, వివిధ అంశాలపై ఆయన..

మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలినాని, సురేశ్‌, సీఎస్‌, డీజీపీ పాల్గొన్నారు. కొత్త

లబ్ధిదారులతో కలిపి 30.3 లక్షల మందికి జులై 8న ఇళ్లపట్టాలు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించిన జగన్​.. వారికి బియ్యం, పింఛను, ఆరోగ్యశ్రీ కార్డులు అందించాలన్నారు. 10 రోజుల్లో రేషన్ కార్డు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డులు లబ్ధిదారులకు అందించే బాధ్యత ఆయా శాఖల అధికారులు దేనన్నారు