• Neti Charithra

10 మంది మున్సిపల్ కమిషనర్ లను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం !



10 మంది మున్సిపల్ కమిషనర్ ల ను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం !


అమరావతి: నేటి చరిత్ర (ఫిబ్రవరి27)

ఆంధ్రప్రదేశ్ లో 10 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వాధికారి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కార్యదర్శి శ్యామలరావు ఈ ఉత్తర్వులు అధికారికంగా ప్రకటించారు. కానీ ఇంత మంది మున్సిపల్ అధికారులు ఒక్కసారిగా బదిలీ అవడం అనేది పలు అనుమానాలకు దారీ తీస్తుంది. ప్రస్తుతానికి ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే గత నెలలో కూడా కొందరు మున్సిపల్ ఉన్నతాధికారులు బదిలీ చేసిన పురపాలక శాఖా, ఇప్పుడు ఇంతమంది కమీషనర్లు బదిలీ అవడం గమనార్హం..

బదిలీ అయినా అధికారులు వీరే…

1.జి.శ్రవణ్ కుమార్ 2.జె.రామారావు 3.షేక్ ఫజీదుల్లా 4.జె.రామ అప్పల నాయుడు 5.ఎ.వెంకటరావ్ 6.వి.రవీంద్ర 7.సీహెచ్. సత్యనారాయణ 8.షేక్ మాలిక్ 9.పి.పల్లా రావ్ 10.పి.నల్లనయ్య