• Neti Charithra

10 నుంచి ప్రజా సమస్యల పై పోరాటాలు!

#10 నుంచి ప్రజా సమస్యల పై పోరాటాలు!

మదనపల్లె:నేటి చరిత్ర (అక్టోబర్9) దేశంలో తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభాన్ని నివారించ డంతోపాటు సామాన్య, మధ్యతరగతి, కార్మిక, రైతు, నిరుద్యోగ యువత రక్షణ కోసం సత్వర చర్యలు చేపట్టాలని కోరుతూ అక్టోబర్‌ 10 నుండి 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు మదనపల్లె సిపిఎం కార్యాలయంలో బుధవారం వామపక్షాల సమావేశం జరిగింది. ఆయా పార్టీల నాయకులంతా ఈ సమావేశంలో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న పలు ప్రజా వ్యతిరేక అంశాలపై చర్చించి, రాష్ట్ర కమిటి పిలుపు అమలుపు కార్యచరణ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పి.శ్రీనివాసులు మాట్లాడుతూ బిజెపి విధానాలు సంపన్న భారతదేశం, పేదరిక భారతదేశం అనే రెండు రకాల భారత దేశంగా మార్చివేస్తున్నాయని ఆరోపించారు. కనీస వేథనాలు అందక, వచ్చే అరకొర వేతనాలు నెలనెలా అందక కార్మిక వర్గం అవస్థలు పడుతుంటే అండగా నిలవాల్సిన కేంద్రం ప్రభుత్వం కార్పోరేట్ వర్గాలకు ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ప్రకటించడం దుర్మార్గం అన్నారు. ఈ విధానాలు కప్పి పుచ్చడం కోసం మతోన్మాద ఘటనలను ప్రేరేపిస్తోందని, ప్రశ్నించే వారిపై దేశద్రోహ కేసులు నమోదు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే రాస్తారోకో కార్యక్రమంలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి.ప్రభాకర్ రెడ్డి, ఎన్.చంద్ర, ఎం.నారాయణస్వామి, సిపిఐ నాయకులు ఎం.సాంబశివ, రాజ్ కుమార్, ఆంజనేయులు, రమణ తదితరులు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon