• Neti Charithra

10 నుంచి కడప పెద్ద దర్గా.. లో భక్తుల దర్శనాలు..కు ఏర్పాట్లు !


10 నుంచి కడప పెద్ద దర్గా.. లో భక్తుల దర్శనాలు..కు ఏర్పాట్లు !
కడప: నేటి చరిత్ర


భక్తుల కోరికలు తీర్చే కడప

పెద్దదర్గా లో సుదీర్ఘ కాలం అనంతరం భక్తులకు దర్శన ప్రవేశాలు కల్పిస్తున్నట్లు

దర్గా నిర్వాహకులు, మేనేజరు మహమ్మద్ అలీఖాన్,అమీర్‌ లు తెలిపారు. కడప పెద్దదర్గా ఆవరణలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలోవారు మాట్లాడారు.కరోనా వైరస్‌ నిర్మూలనలో భాగంగా సుమారు 70 రోజులు కు పైగా పెద్దదర్గాను కూడా మూసివేశామన్నారు. తిరిగి ఈనెల 10వ తేదీ నుంచి ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ తెరుస్తున్నామని చెప్పారు. దర్గాకు వచ్చే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు. ప్రతి ఒక్కరికీ థర్మల్‌ పరికరం ద్వారా

ఉష్ణోగ్రతను తనిఖీ చేస్తామని తెలిపారు. దర్గా ఆవరణ ప్రారంభంలో ఆటోమేటిక్‌ శానిటైజర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. పెద్దదర్గా సేవకులు పీపీఈ కిట్లు ధరిస్తారని పేర్కొన్నారు. మాస్కు లేనిదే లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. గతంలో దర్గాలోకి వచ్చి సమాధులను తాకి ప్రార్థనలు చేసేవారన్నారు. ఇప్పుడు దూరం నుంచే ప్రార్థనలు చేసుకోవాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకోవాలని చెప్పారు. గురువారం ప్రత్యేక ప్రార్థనలకు

పాలు తీసుకుని రావద్దన్నారు. ఉదయం 5.30 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్గాను తెరిచి ఉంచుతామన్నారు. దర్గా ఆవరణలో ఉమ్మి వేయరాదన్నారు. ఆరోగ్య సేతు యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని తెలిపారు. 60 సంవత్సరాలు దాటిన వారు, పదేళ్ల లోపు వారికి దర్గాలో ప్రవేశం లేదన్నారు. తీర్థప్రసాదాలను నిషేధించామన్నారు. టోపీలు ఇవ్వబోమన్నారు. ఒక్కో వ్యక్తి ఆరుడగుల దూరంలో ఉండే విధంగా గుర్తులు వేశామన్నారు. దర్గాకు వచ్చే వారి చిరునామా, ఆధార్‌కార్డు నంబరు నమోదు చేస్తామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని పెద్ద దర్గా పర్యవేక్షకులు పేర్కొన్నారు.

73 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon