• Neti Charithra

హార్సిలీహిల్స్ సమీపం లో.. వైద్య..సిబ్బంది దంపతులకు..కరోనా..పాజిటివ్..!



హార్సిలీహిల్స్ సమీపం లో.. వైద్య..సిబ్బంది దంపతులకు..కరోనా.. పాజిటివ్..!




బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం లో వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ రావటం తో వైద్య సిబ్బంది ఉలిక్కి పడుతున్నారు. హార్సిలీహిల్స్ సమీపం లో విధులు నిర్వహిస్తున్న ఓ ఏ ఎన్ ఎం కు వైద్య పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. అనంతపురం జిల్లా తనకల్లు లో నివాసం ఉంటున్న ఈమె బి కొత్తకోట మండలం హార్సిలీహిల్స్ సమీపం లోని ఓ గ్రామం లో జాతీయ రహదారి పై

ఉన్న గ్రామానికి సంబంధించి

ఏ ఎన్ ఎమ్ గా బాధ్యతలు చూస్తోంది. ఈమె భర్త కు కూడా ఇటీవల కరోనా పాజిటివ్ రాగ అతను తిరుపతి లోని కోవిద్ ఆసుపత్రి లో చికిత్సలు పొందుతున్నాడు. తాజాగా అతని భార్య అయిన ఏ ఎన్ ఎం అనుమానంతో వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె కు కూడా పాజిటివ్ తెలడం తో ఆమె ను కూడా వైద్య చికిత్సలు కోసం అధికారులు

కోవిద్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న స్థానికంగా ఉన్న గ్రామాల్లో ని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ మె కు సన్నిహితంగా మెలిగిన వారి ఆచూకీ కోసం అధికారులు అరా తీస్తున్నారు. కాగ ఈ ఘటన పై అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


1,135 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon