• Neti Charithra

హార్సిలీహిల్స్ సమీపంలో మైనర్ బాలిక కిడ్నప్.. ఆపై లైంగిక దాడి.. గ్రామంలో భయం.. భయం !

Updated: Jun 3


హార్సిలీహిల్స్ సమీపంలో మైనర్ బాలిక కిడ్నప్.. ఆపై లైంగిక దాడి.. గ్రామంలో భయం.. భయం !



బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా బి కొత్తకోట మండలం హార్సిలీహిల్స్ సమీపంలో ని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక ను కిడ్నప్ చేసి ఆపై ఇద్దరు దుండగులు అఘాయత్నాని కి పాల్పడటం తో గ్రామం మొత్తం భయం తో వణికి పోతోంది. గ్రామస్తుల కథనం మేరకు..

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి లోని హార్సిలీహిల్స్ సమీపంలో ని బండారువారి పల్లె గ్రామ

పంచాయతీ పెద్దపల్లి కి చెందిన 13 సంవత్సరాల వయస్సు కలిగిన 8 వ తరగతి విద్యార్థిని ను ఇద్దరు దుండగులు సోమవారం సాయంత్రం కిడ్నప్ చేసి

తీసుకెళ్లారు. అయితే ఆ విద్యార్థిని ని దుండగులు శీలం వారిపల్లె పంచాయతీ పరిధిలోని ఓ స్టోన్ క్వారీ సమీపంలో బంధించి లైంగిక దాడికి ప్రయత్నించి నట్లు సమాచారం. ఈ సందర్భంగా బాలిక కేకలు వేయగా అరుపులు గుర్తించిన సమీప పొలాల కు చెందిన కొందరు సమాచారాన్ని విద్యార్థిని కుటుంబ సభ్యులకు అందించడంలో కుటుంబ సభ్యులు రాత్రి 10 గంటల సమయం లో క్వారీ వద్దకు చేరుకొని దుండగుల నుంచి బాలికనురక్షించుకున్నారు. కాగ ఈ అఘాయిత్యాని కి పాల్పడ్డ

నిందితుల్లో ఒకరు అంగళ్ళు సమీపం లో జరిగిన జంట హత్యకేసు లోను అలాగే మదనపల్లె పట్టణం లో ఓ ప్రముఖ మహిళ న్యాయవాది దారుణ హత్య కేసులో నిందితుడు గా తెలుస్తోంది. పెద్దపల్లి లో జరిగిన ఘటన తో గ్రామం లో మహిళలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే.. భయంతో వణుకు తుండగా మరికొందరు మరికొందరు భయంతో గ్రామం వదిలి వెళుతున్నట్లు సమాచారం.

మైనర్ బాలిక ను కిడ్నప్ చేసి తీసుకెళ్లిన దుండగుడు కు తీవ్ర నేర చరిత్ర ఉండటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నట్లు సమాచారం.


(నేటి చరిత్ర.. కథనానికి స్పందన ...

ఇద్దరిపై కేసు నమోదు !)


1,348 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon