• Neti Charithra

హార్సిలీహిల్స్ సమీపం లో..జాతీయ రహదారి పై నిలువెత్తు.. గోతులు.. అధికారుల సాక్షిగా నిర్లక్ష్యం!


హార్సిలీహిల్స్ సమీపం లో..జాతీయ రహదారి పై నిలువెత్తు.. గోతులు.. అధికారుల సాక్షిగా నిర్లక్ష్యం!




బి కొత్తకోట: నేటి చరిత్ర


(జాతీయ రహదారి పై గోతులతో ప్రమాదానికి గురైన కారు)


( జాతీయ రహదారి పై గోతులు పూడ్చుతున్న పెద్దరెడ్డి గారిపల్లె యువకులు)


చిత్తూరు జిల్లా హార్సిలీహిల్స్ సమీపం లో జాతీయ రహదారి కి స్థానికులు మరమ్మత్తు లు చేశారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ముంబై- చెన్నై జాతీయ రహదారి గోతులు మాయమై దుస్థితికి చేరుకొంది. ముఖ్యంగా హార్సిలీహిల్స్ సమీపం లోని పెద్దరెడ్డిగారిపల్లి దగ్గర గత 3మూడు రోజులుగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఆదివారం ఓ కారు ఇదే రోడ్డు పై ప్రమాదానికి గురైంది.

అదృష్టవశాత్తూ ప్రాణ పాయం తప్పింది. అంతకు మునుపు రెండు రోజుల్లో నాలుగు ద్విచక్ర వాహనాలు ఇదే ప్రాంతం లో బోల్తాపడి పలువురు గాయపడ్డారు.

ఇటీవల కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటం తో నడి రోడ్డు గుంత లలో నీరు నిలుస్తుండటం కూడా ప్రమాదాలు

పెరగటానికి మరో కారణంగా మారుతోంది.

జాతీయ రహదారి పర్యవేక్షణ అధికారుల

నిర్లక్ష్యం పై విమర్శలు వెలువెత్తుతున్నాయి.

తాజాగా పెరుగుతున్న ప్రమాదాలను గుర్తించి

పెద్దరెడ్డిగారిపల్లి యువకులు చొరవ తీసుకొని రాళ్లు,మట్టితో గుంతలు పూడ్చి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్య క్రమంలో రెడ్డిశేఖర్, అంజి నేయలు, శ్రీకాంత్ .అశోక్ కుమార్ రెడ్డి సుధాకర్ రెడ్డి. అనిల్ .సతీష్ పాల్గొన్నారు.




418 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon