• Neti Charithra

హార్సిలీహిల్స్ సమీపం లో ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు..నుజ్జు అయిన కారు ... మదనపల్లె వాసి మృతి !


హార్సిలీహిల్స్ సుమీపం లో ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు..నుజ్జు అయిన కారు ... మదనపల్లె వాసి మృతి !


(కారు ను ఢీ కొన్న పాల లారీ)


(కారు లో చిక్కుకున్న మృత దేహాన్ని బయటకు తీసేందుకు కృషి చేస్తున్న పోలీసులు)

(కారు లోనే ఇరుక్కున్న వెంకటరమణ రెడ్డి)



(మృతుడు వెంకటరమణ రెడ్డి ఫైల్ ఫోటో)


(రోడ్డు ప్రమాద విజువల్స్)



కురబలకోట: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా హార్సిలీహిల్స్ సమీపం లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఓ వ్యక్తి అక్కడి కక్కడే మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. హార్సిలీహిల్స్- మదనపల్లె మార్గం కంటేవారి పల్లె సమీపం లోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ముంబై- చెన్నై జాతీయ రహదారి లో మదనపల్లె నుంచి అనంతపురం వైపు వస్తున్న పాల లారీని కదిరి నుంచి

మదనపల్లె కు వెళుతున్న ఇన్నోవా కారు వేగంగా ఢీ కొంది .ఈ ప్రమాదం లో కారు నుజ్జు.. నుజ్జు కాగ అందులో ప్రయాణిస్తున్న

మదనపల్లె కు చెందిన గీతా వాణి స్కూల్ కరస్పాండెంట్ వెంకట రమణ రెడ్డి

కారు లోనే మృతి చెందాడు. అదే

సమయంలో బి కొత్తకోట నుంచి మదనపల్లె కు వెళుతున్న రూరల్ సి ఐ అశోక్ కుమార్ వాహనం దిగి సహాయ చర్యలు చేపట్టారు. ఘోర ప్రమాదం తో స్తంభించిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.పాల లారీ డ్రైవర్ పరారు అయ్యాడు. ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


4,177 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon