• Neti Charithra

హార్సిలీహిల్స్ లో .. రాయలసీమ రుచుల..కోసం.. ప్రత్యేక ఏర్పాట్లు !


హార్సిలీహిల్స్ లో .. రాయలసీమ రుచుల..కోసం.. ప్రత్యేక ఏర్పాట్లు !



హార్సిలీహిల్స్: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ లో పర్యాటక శాఖ సముదాయాలను శుద్ధి చేసే ప్రక్రియ ను

ముమ్మరంగా చేపడుతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో 75 రోజుల పాటు హార్సిలీహిల్స్ లో రెస్టారెంట్, అతిథి గృహాలు , బార్,

స్విమ్మింగ్ పూల్, అడ్వెంచర్ సముదాయాలు,






పిల్లల పార్కు లు మూత పడ్డాయి. తాజా గా సోమవారం నుంచి మళ్ళీ హార్సిలీహిల్స్ లో పర్యాటక శాఖ సేవలను దశల వారీగా అందుబాటు లోకి రానున్నాయి. తిరుపతి డివిఎం సురేష్ రెడ్డి సూచనలు మేరకు.. మేనేజర్ మురళి అందుకు అవసరం అయిన ఏర్పాట్లు చేయిస్తున్నారు. గత ఐదు

రోజులుగా అతిథి గృహాలు, సముదాయాలు శుభ్రం చేయగా ఆదివారం హార్సిలీహిల్స్ లో ని అణువణువు ను సిబ్బంది స్ప్రెయింగ్ పనులు చేయించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గ దర్శకాల మేరకు .. అధికారులు పారిశుధ్య పనులు పూర్తి చేశారు. సోమవారం నుంచి పర్యాటకులకు అధునాతన వసతులతో ఆతిథ్యం తో పాటు నోరూరించే రాయలసీమ రుచులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తుండటం విశేషం.



325 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon