• Neti Charithra

హార్సిలీహిల్స్ లో అవినీతి పై విచారణకు ఆదేశించిన జాయింట్ కలెక్టర్ మార్కేండేయులు !

#హార్సిలీహిల్స్ లో అవినీతి పై విచారణకు ఆదేశించిన జాయింట్ కలెక్టర్ మార్కేండేయులు !

బి కొత్తకోట: (సెప్టెంబర్5) ' నేటి చరిత్ర' గల్లీ2ఢిల్లీ కథనాల పై జిల్లా అధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు. చిత్తూరు జిల్లా పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ లోని జిల్లా సహకారశాఖ మార్కెటింగ్ సొసైటీ కి చెందిన అతిథి గృహాల ఆధునిరణ పనుల్లో జరిగిన లక్షల రూపాయల అవినీతి పై జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు విచారణకు ఆదేశించారు. హార్సిలీహిల్స్ లో ఇటీవల రూ.17 లక్షల సంస్థ నిధుల తో ను అలాగే మరో రూ.10 లక్షల కలిపి రూ. 27 లక్షల తో ఆధునీకరణ పనులు చేపట్టారు. ఈ పనులు చేసిన రెండు మాసాలకే అతిథి గృహాలు నిర్మాణాలు ధ్వంసం మై నేల కూలాయి. వీటికి సంబంధించిన అవినీతి పనుల పై 'నేటి చరిత్ర గల్లీ2ఢిల్లీ' యూట్యూబ్ ఛానల్ లో వచ్చిన కథనాలు పై సహకార శాఖ మార్కెటింగ్ సొసైటీ పర్సన్ ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ మార్కేండేయులు స్పందించారు. హార్సిలీహిల్స్ లో జరిగిన అవినీతి తో పాటు మదనపల్లె, వాల్మీకిపురం, కలికిరి, పుంగనూరు, పలమనేరు లలో ఉన్న సహకార శాఖ మార్కెటింగ్ సొసైటీ కు చెందిన ఆస్తుల స్థితి గతులు.. అన్యా క్రాంత వివరాలు.. అవినీతి.. అక్రమాలు కు సంబంధించి పూర్తి స్థాయి విచారణ కు ఉన్నతాధికారులు ఆదేశించారు. వీటికి సంబంధించి మదనపల్లె డివిజన్ సహకార శాఖ రిజిస్టార్ చంద్రశేఖర్ రెడ్డి, ఆడిట్ అధికారి ఆనంద్ తో పాటు మరికొందరు సహకార శాఖ అధికారులు గురువారం హార్సిలీహిల్స్ లోని సంస్థ కు చెందిన అధికారుల బృందం తనిఖీలు చేశారు. ఈ విచారణ లో గత పాలక మండలి లోని శాంతిపురం కు చెందిన టీడీపీ కీలక నేత అప్పటి శ్యాం రాజ్ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా టెండర్లు వేయకనే సుమారు రూ.20 లక్షల విలువైన పనులు బినామీ కాంట్రాక్టర్ ద్వారా చేయించినట్లు విచారణ అధికారులు గుర్తించారు. మరో వైపు ప్రభుత్వ నిబంధనలు గాలికి వదిలి టెండర్ ప్రక్రియ కాకుండా అడ్డదారి లో తన బినామీ వ్యక్తికి 10 అతిథి గృహాలతో పాటు మరో రెండు కాంప్లెక్స్ భవనాలు, క్యాంపు కార్యాలయాన్ని సైతం నెలకు రూ.10 వేలు అద్దె పై బినామీ వ్యక్తులకు నిబంధనలకు వ్యతిరేకంగా లీజు కు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. వాటి లో రెండు భవన సముదాయాలు అనధికారికంగా హోటల్ నిర్వహణకు సబ్ లీజ్ కు ఇచ్చినట్లు కూడా అధికారుల బృందం గుర్తించినట్లు సమాచారం. వీటి నివేదికలను జిల్లా అధికారులకు సమర్పించనున్నట్లు అధికారుల బృందం విలేఖర్లకు తెలిపారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon