• Neti Charithra

హార్సిలీ హిల్స్ టౌన్ షిప్ కమిటీ అభివృద్ధికి అడుగులు వేసేనా!

# బి కొత్తకోట: నేటి చరిత్ర

నాలుగేళ్ల తర్వాత నేడు హార్సిలీహిల్స్ టౌన్ షిప్ కమిటీ సమావేశం

- కీలక నిర్ణయాల పై కోటి ఆశలు!

చిత్తూరు జిల్లా పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ టౌన్ షిప్ కమిటీ సమావేశం నాలుగేళ్ల తర్వాత శుక్రవారం సాయంత్రం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు.

హార్సిలీహిల్స్ గతం లో బి కొత్తకోట మండలం కోటవురు గ్రామపంచాయతీ లో ఉండేది. 2001 సంవత్సరం లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హార్సిలీహిల్స్ ను ప్రత్యేక టౌన్ షిప్ కమిటీ గా ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ మదనపల్లె ఆర్డీవో చెర్మన్ గా ను సభ్యులు గా జడ్పి సీఈఓ, పంచాయతీ రాజ్ ఈ ఈ, అటవీశాఖ రెంజర్, పోలీస్ శాఖ మరియు టూరిజం డివిజనల్ మేనేజర్, డివిజనల్ పంచాయతీ అధికారి తదితరులు అఫీషియల్ సభ్యులు గాను స్థానిక ఎంపీ తో పాటు స్థానిక ఎమ్మెల్యే మరియు మరో ఇద్దరు సీనియర్ సిటీజన్లు గౌరవ సభ్యులుగా కొనసాగుతున్నారు. అయితే 19 సంవత్సరాల కాలం లో కనీసం ఐదు సమావేశాలు కూడా అధికారులు జరుపలేదనే ఆరోపణలు ఉన్నాయి. 2015 లో హార్సిలీహిల్స్ టౌన్ షిప్ కమిటీ చివరి సమావేశం జరిగింది. ప్రత్యేక అభివృద్ధి పేరుతొ సుమారు 19 సంవత్సరాల క్రితం ఈ కమిటీ ఏర్పాటు అయిన నేటికి ఎక్కడ అభివృద్ధి జాడే కనబడని పరిస్థితి నెలకొంది. గత నాలుగేళ్ల క్రితం అప్పటి సబ్ కలెక్టర్ మల్లికార్జున హిల్స్ లో పర్యాటకుల సౌకర్యార్థం పలు మౌలిక వసతులు కల్పించారు. ప్రస్తుతం హార్సిలీహిల్స్ లో భూ సమస్యలు వివాదంగా మారుతున్నాయి. ఆక్రమకట్టడాలు రోజు రోజుకు పెరుగుతుండటంతో పాటు మరికొందరు భూ ఆక్రమనలకు పాల్పడుతున్నారని విమర్శలు వినబడుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన రెవిన్యూ అధికారులు సొంత ప్రయోజనాల కే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తు తున్నాయి. మరో వైపు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఇక్కడికి వచ్చి వెళుతుంటారు. ఇక్కడికి వచ్చే మహిళా పర్యాటకుల పై లైంగిక దాడులు, మందు బాబుల ఆగడాలు, ఇక్కడి కొందరు ఉద్యోగుల లైంగిక వేధింపులు వంటి ఘటనలు మాయని మచ్చగా నిలుస్తున్నాయి.

ఇంకో వైపు హార్సిలీహిల్స్ లో మురికి నీటి కాలువలు లేక రహదారుల పైనే మురుగునీరు ప్రవహిస్తోంది. ఇంకో వైపు పర్యావరణానికి హానికరంగా మారుతున్న నాసిరకం ప్లాస్టిక్ వినియోగం విచ్చల విడిగా జరుగుతోంది. హిల్స్ లోని ప్రధాన రహదారుల లో లైటింగ్ వసతి లేక పర్యాటకులు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ పోలీస్ ఔట్ పోస్ట్ ఉన్నా సిబ్బంది లేక భవనాలు నిరుపయోగంగా మారుతోంది. హిల్స్ లో తాగునీటి ఎద్దడి వెంటాడుతోంది. దింతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు తమ వాహనాల లొనే క్యాన్ లలో నీటిని తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడుతోంది. అంతేకాక చెత్తా చెదారం తొలగించే వారు లేక పరిసరాలు అపరి శుభ్రంగా మారి ఇక్కడికి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలుకు తోంది. నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న హార్సిలీహిల్స్ టౌన్ షిప్ కమిటీ సమావేశాల్లో నైనా హార్సిలీహిల్స్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటారని పర్యాటకులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.

19 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon