• Neti Charithra

హీరో సూర్య.. తండ్రి శివ కుమార్ పై.. టీటీడీ ఫిర్యాదు.. కేసు నమోదు!


హీరో సూర్య.. తండ్రి శివ కుమార్ పై.. టీటీడీ ఫిర్యాదు.. కేసు నమోదు!



తిరుమల: నేటి చరిత్ర


టిటిడిపై తమిళ హీరో సూర్య తండ్రి శివకుమార్‌ సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో డబ్బులున్న వారికే దర్శనాలు కల్పిస్తారని, గెస్ట్‌హౌస్‌లు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు దర్శనం కల్పించకుండా తోసేస్తారని వాపోయారు.

అలాంటి ఆలయంలోకి ఎందుకు వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. టిటిడిపై దుష్ప్రచారం చేశారంటూ 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైన వారిలో హీరో సూర్య తండ్రి శివకుమార్‌ కూడా ఉన్నారు. తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని,

తిరుమలకు వెళ్లొద్దంటూ శివకుమార్‌ అసత్య ప్రచారం చేశారని తమిళ మయ్యన్‌ అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

216 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon