• Neti Charithra

హైదరాబాదు లో భారీ అగ్ని ప్రమాదం!

#హైదరాబాదు లో భారీ అగ్ని ప్రమాదం!

హైదరాబాద్: నేటి చరిత్ర (అక్టోబర్12) హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నాంపల్లిలోని యం.జే మార్కెట్‌ వద్ద శనివారం తెల్లవారుజామున 5 గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పీవీసీ పైపులను నిల్వ ఉంచిన బిల్డింగ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది. ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్నఅగ్నిమాపక శాఖ అధికారులు, హుటాహుటిన ఘటనా స్థలికి వచ్చి ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon