• Neti Charithra

సుప్రీం కోర్టు కెళ్లిన నిర్భయ కేసు నిందితుడు!

#సుప్రీం కోర్టు కెళ్లిన నిర్భయ కేసు నిందితుడు!

ఢిల్లీ : నేటి చరిత్ర (డిసెంబర్10) 2012 నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు నిందితుల్లో ఒకడైన అక్షరు సింగ్‌ మంగళవారం సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తనకు ఉరిశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును పున్ణ సమీక్షించాలని కోరుతూ.. అతడు పిటిషన్‌ దాఖలు చేశాడు. తాజా పిటిషన్‌తో నిర్భయ కేసులో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉరిశిక్ష అమలవుతుందా లేదా అన్నది మరోసారి సందేహాస్పదంగా మారింది. ఇప్పటికే ఈ రివ్యూ పిటిషన్‌ సుప్రీం కోర్టులో దాఖలు కాగా... సుప్రీం కోర్టు రిజిస్ట్రీ దీన్ని స్వీకరించింది. కాగా ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు వినరు, పవన్‌ కుమార్‌ గుప్తా ప్రస్తుతానికి సుప్రీం కోర్టులో ఉపశమనం కోసం పిటిషన్‌ దాఖలు చేయలేదు. నిందితుల తరపు న్యాయవాది మాట్లాడుతూ.. అక్షరు రివ్యూ పిటిషన్‌పై ఏ సంగతీ తేలిన తర్వాతే మిగతా నిందితులు కలిసికట్టుగా క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేస్తారని తెలిపారు. ఈ కేసులోని మరో నిందితుడు పవన్‌ గుప్తాను ఇప్పటికే మండోలీ జైల్‌ నుంచి తీహార్‌ జైలుకు తరలించారు. గుప్తాతో పాటు మరో ఇద్దరు నిందితులు ముఖేశ్‌ సింగ్‌, అక్షరు ప్రస్తుతం రెండో నెంబర్‌ తీహార్‌ జైల్లో ఉన్నారు. మరో నిందితుడు వినరు శర్మను నాలుగో నంబర్‌ తీహార్‌ జైల్లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon