• Neti Charithra

స్నేహితుడు.. రూమ్.. కు పిలిచి... వేధించాడని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య !

స్నేహితుడు రూమ్ కు పిలిచి.. వేధించాడని... ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య !

తూర్పుగోదావరి: నేటి చరిత్ర (ఫిబ్రవరి23)

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరిపోడులో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు తనను రూమ్‌కు రమ్మని వేధించాడని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్‌కు ముందు ఓ నోట్ కూడా రాసింది. ఇందులో ఆ యువకుడి గురించి విద్యార్థిని ప్రస్తావించింది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్, వాట్సప్ చాటింగ్ వంటి కీలక ఆధారాలు పోలీసులకు లభ్యమయ్యాయి. రెండు మూడు రోజుల్లో కేసును ఛేదిస్తామని పోలీసులు మీడియాకు వెల్లడించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

65 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon