• Neti Charithra

సైన్యం.. కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులు మృతి!

#సైన్యం.. కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులు మృతి!

కాశ్మిర్: నేటి చరిత్ర (నవబర్11) పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని బందిపొర జిల్లాలో ఉన్నారనే సమాచారంతో జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతాబలగాలు సోమవారం ఉదయం గాలింపు చేపట్టాయి. ఈ గాలింపు సందర్భంగా భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తిరిగి భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల మృతదేహాలతోపాటు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని జమ్మూకశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన ఉగ్రవాదులు ఏ గ్రూపునకు చెందిన వారో ఇంకా తెలియలేదు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon