• Neti Charithra

సీనియర్ ఐఏఎస్ అధికారి కి టీటీడీ పాలకమండలి లో అదనపు అవకాశం..!


సీనియర్ ఐఏఎస్ అధికారి కి టీటీడీ పాలకమండలి లో అదనపు అవకాశం..!



తిరుమల: నేటి చరిత్ర


సీనియర్ ఐఏఎస్ అధికారి కి టీటీడీ లో కీలక సభ్యత్వం లభించింది.

తితిదే ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యునిగా రాష్ట్ర దేవాదాయశాఖ కార్యదర్శి ఎం.గిరిజాశంకర్‌ శుక్రవారం తిరుమల శ్రీవారి

ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. రంగనాయకుల మండపంలో ఆయనకు వేదపండితులు వేదాశీర్వచనం

అందించగా.. ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, తిరుపతి జేెఈవో పి.బసంత్‌కుమార్‌,

జేెఈవో ఎస్‌.భార్గవి, సీవీఎస్‌వో గోపినాథ్‌ జెట్టి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, డిప్యూటీ ఈవో జనరల్‌ సుధారాణి పాల్గొన్నారు.


150 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon