• Neti Charithra

సైనికుల సాహసమే.. దేశ ప్రజలకు మనోధైర్యం- ప్రధాని మోదీ !


సైనికుల సాహసమే.. దేశ ప్రజలకు మనోధైర్యం- ప్రధాని మోదీ !




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)



మనసైనిక బలగాలు నిరుపమాన సాహసాలు ప్రదర్శిస్తూ ప్రపంచానికి భారత్ సత్తా చాటుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. చైనాతో ఎల్ఏసీ వెంబడి పరిస్థితిని సమీక్షించేందుకు లడక్ ఉమ్మడి రాజధాని లెహ్‌లో ప్రధాని మోదీ శుక్రవారంనాడు ఆకస్మిక పర్యటన జరిపారు. ఇందులో భాగంగా లడక్‌లోని నీమూలో సైనికులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, బలగాల ధైర్యసాహసాలు నిరుపమానమని ప్రశంసించారు. దేశం కోసం గాల్వాన్ లోయలో ప్రాణాలర్పించిన  అమర

జవానులకు మరోసారి ఘన నివాళులు తెలియజేస్తున్నానని అన్నారు. సైనికుల సాహసం వారు విధులు నిర్వహిస్తున్న ఎత్తైన ప్రాంతాల కంటే సమున్నతమని మోదీ కొనియాడారు. సైనికుల సాహసాలు, చూపుతున్న శౌర్యప్రతాపాలతో స్వయం సమృద్ధ భారత్‌ మరింత పటిష్టమవుతుందని అన్నారు.


88 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon