• Neti Charithra

స్థానిక సంస్థలఎన్నికల పై కీలక వ్యాఖ్యలు చేసిన.. ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్..!


స్థానిక సంస్థల ఎన్నికల పై కీలక వ్యాఖ్యలు చేసిన.. ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్..!



నేటి చరిత్ర: అమరావతి


ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి న షెడ్యూల్ పై

జరుగుతున్న ప్రచారాన్ని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కొట్టి పారేశారు.

 స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినట్టు గత 24 గంటలుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ

షెడ్యూల్‌పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న షెడ్యూల్ పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. ఎన్నికల కమిషనర్‌గా తాను ఎలాంటి షెడ్యూల్ విడుదల చేయలేదని

నిమ్మగడ్డ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాన్ని, ప్రోత్సహించే విధంగా ఉందనే అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. ఇది కేవలం తప్పుడు సమాచారం మాత్రమేనని.. ఇందులో వాస్తవికత లేదని మరోసారి ఎన్నికల కమిషనర్ తెలిపారు.


1,291 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon