• Neti Charithra

సీడ్స్ సంస్థ సేవలు భేష్- మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా..!


సీడ్స్ సంస్థ సేవలు భేష్- మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా..!



మదనపల్లె: నేటి చరిత్ర


సీడ్స్ సంస్థ సేవలు అభినందనీయమని

చిత్తూరు జిల్లా మదనపల్లె శాసనసభ్యులు నవాజ్ భాష కితాబునిచ్చారు. ఆదివారం స్థానిక మదనపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ నందు సీడ్స్ వార్షికోత్సవ సభ జరిగింది. వార్షికోత్సవ సభలో ముఖ్య అతిథిలుగా

మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ భాష, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసులు. భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు పి.టి.ఎం శివప్రసాద్, బి.ఎస్.పి రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్, రిటైర్డ్ సబ్ జైలు సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ

తదితరులు హాజరయ్యారు. వార్షికోత్సవ సభలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మొదటి వార్షికోత్సవం సందర్భంగా శాసనసభ్యులు చేతుల మీదుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్దులకు, రాష్ట్ర స్థాయి బ్యాట్ మింటన్ క్రీడాకారుడు, నిరుద్యోగ యువకులకు రెండు లక్షల రూపాయల చెక్కులను అందచేశారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన పోటీ పరీక్షల లో ప్రథమ ర్యాంకు వచ్చిన వారికి ధ్రువపత్రాలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవాజ్ భాష మాట్లాడుతూ చదువుకుని ఉద్యోగం చేసుకుంటూ తన తల్లిదండ్రులను పట్టంచుకోని స్వార్ధపరులు ఉన్న ప్రస్తుత సమాజంలో సామాజిక బాధ్యతతో ఆర్థిక సహకారాలు అందించడానికి యువతకు ముందుకు రావడం అభినందనీయం అన్నారు. సామాజిక భాద్యతతో కృషి చేస్తున్న రాజశేఖర్ ఆదర్శనీయుడని కితాబునిచ్చారు. రాజశేఖర్ లాంటి వ్యక్తిని సమాజానికి అందించిన తల్లిదండ్రులను అభినందించారు. ఈ సమావేశంలో సీడ్స్ వ్యవస్థాపకుడు వి.రాజశేఖర్ మాట్లాడుతూ సీడ్ సంస్థ ఏర్పడిన సంవత్సరం పూర్తి చేసుకున్నదని, 35మంది పేద విద్యార్థులు, వ్యవసాయం చేసుకో లేక ఇబ్బందులు పడుతున్న వారికి, చదువు పూర్తయి ఉద్యోగం రాని నిరుద్యోగ యువతకు ఆసరాగా ఉండడానికి ఎనిమిది లక్షల రూపాయల వరకూ ఖర్చు చేసినట్లు వివరించారు. ప్రభుత్వ స్కూళ్ళలో చదివి ఉద్యోగాలు చేసుకుంటున్న యువత టీమ్ గా ఏర్పడి చదువుకోవడానికి ఎవరూ ఇబ్బందులు ఎదుర్కోకూడదని, ఉద్యోగాల కోసమే కాకుండా స్వయం ఉపాధి అవకాశాల పట్ల అవగాహన కల్పించడమే సీడ్స్ సంస్థ లక్ష్యమని అన్నారు. రాబోయే

సంవత్సరంలో 18 లక్షల రూపాయలు ఖర్చు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీడ్స్ సంస్థ అధ్యక్షుడు కె.ప్రవీణ్, ఉపాధ్యక్షులు కె.నవీన్, కోశాధికారి వి.రాజేశ్వరి, కన్వీనర్ కె.మహేష్ తదితరులతో పాటు సీడ్స్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.


158 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon