• Neti Charithra

సంచలన నిర్ణయం .. తీసుకుని ఆదర్శం గా నిలిచినడిప్యూటీ సీఎం అంజాద్ బాషా..!



సంచలన నిర్ణయం .. తీసుకుని ఆదర్శం గా నిలిచినడిప్యూటీ సీఎం అంజాద్ బాషా..!


కడప: నేటి చరిత్ర

ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాష ఆదర్శంగా నిలిచారు. కరోనా బాధితులు కోలుకోవాలనే ఉద్ధేశంతో అన్ని కొవిడ్‌ కేంద్రాల్లో ప్లాస్మా సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని

ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన

పేర్కొన్నారు. కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఆయన ప్లాస్మా సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మొదట ఆయనే ప్లాస్మాదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ నుంచి కోలుకున్నవారిలో యాంటీబాడీస్‌ అభివృద్ధి చెందుతాయని, కరోనా బారిన పడి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారికి, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌పై ఉన్న వారికి ఈ యాంటీబాడీస్‌ ఉన్న ప్లాస్మాను ఎక్కిస్తే తప్పకుండా ప్రాణాపాయం నుంచి బయటపడతారన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ప్లాస్మా దానం చేసి జిల్లాను కరోనా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ (అభివృద్ధి) సాయికాంత్‌ వర్మ, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రసాదరావు, నోడల్‌ అధికారి, కడప నగరపాలక సంస్థ కమిషనర్‌ లవన్న, ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో కోటేశ్వరి, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వరలక్ష్మి, ఆర్‌ఎంవో డాక్టర్‌ కొండయ్య పాల్గొన్నారు.


288 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon